Header Banner

టీడీపీ నేత ఘాటు వ్యాఖ్యలు! అసలైన బిగ్ బాస్ ను అరెస్టు చేసేది ఎప్పుడు?

  Sat Apr 26, 2025 13:04        Politics

 

జగన్ ప్రభుత్వ కాలంలో లిక్కర్ స్కాం ఓ అంతర్జాతీయ కుంభకోణంగా మారిందని టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విమర్శించారు. లిక్కర్ స్కామ్‌లో అసలు బిగ్‌బాస్‌ను జైలుకు పంపాలని డిమాండ్ చేశారు. బిగ్‌బాస్ దురాశ వల్ల నాసిరకం మద్యం తాగి ఎందరో పేదలు ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. మద్యపాన నిషేధం హామీతో అధికారంలోకి వచ్చిన జగన్ ప్రభుత్వం, అదే మద్యం ద్వారా పేదల ప్రాణాలను తీసుకోవడం నేరమని తీవ్రంగా విమర్శించారు. లిక్కర్ స్కామ్‌పై కేంద్రం తక్షణం జోక్యం చేసుకుని, సీబీఐ, ఈడీ లాంటి సంస్థలను రంగంలోకి దించాలని డిమాండ్ చేశారు.

 

సోమిరెడ్డి వివరించిన ప్రకారం, ప్రస్తుతం వరకు సీఐడీ దర్యాప్తులో రూ.3200 కోట్లు వెలికితీయబడినా, మద్యం స్కాంలో నిజమైన లావాదేవీలు రూ.10 వేల కోట్లు దాటే అవకాశం ఉందని పేర్కొన్నారు. డిపోల ద్వారా కాకుండా అనధికారికంగా బయటకు వెళ్లిన మద్యం కారణంగా భారీగా నష్టం జరిగిందని అన్నారు. ఒక్కో సమాచారం బయటపడుతున్నప్పటికీ ఈడీ ఇంకా రంగంలోకి దిగకపోవడంపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. మద్యం కుంభకోణంపై మరింత లోతైన దర్యాప్తు అవసరమని సోమిరెడ్డి స్పష్టం చేశారు.

 

ఇది కూడా చదవండి: వైసీపీ నేతకు దిమ్మదిరిగే షాక్! అప్పుల భారం - ఆస్తులు వేలం!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

వీరయ్య చౌదరి హత్య కేసులో కీలక ఆధారాలు! స్కూటీ స్వాధీనం! వారిద్దరు నిందితులుగా గుర్తింపు!

 

అర్ధరాత్రి భారత జవాన్లపై పాక్ కాల్పులు! కాశ్మీర్ ఎల్ఓసీ పొడవునా..

 

ఢిల్లీలో జరిగిన గంటల చర్చలు.. కీలక నిర్ణయాలు ! వాటికి ఓకే చెప్పిన మోదీ!

 

మరో నామినేటెడ్ పోస్ట్ లిస్ట్ రెడీ! కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఎప్పుడంటే?

 

సీఎంలకు హోం మంత్రి అమిత్ షా ఫొన్.. 48 గంటల లోపు.. ఎందుకంటే.!

 

మహిళలకు ప్రభుత్వం శుభవార్త.. 2-3 రోజుల్లో అకౌంట్లలోకి డబ్బులు.! వారికి ఇక పండగే పండగ..

 

సస్పెండ్ విషయంలో దువ్వాడ కీలక వ్యాఖ్యలు! తాను ఎప్పుడూ పార్టీకి..

 

మరోసారి బరితెగించిన వైసీపీ మూకలు..! ఏం చేశారంటే..!

 

వైసీపీ గుట్టు రట్టు! సెక్షన్లకే షాక్ ఇస్తున్న సునీల్ కుమార్ కేసులు!

 

ఏపీ ప్రజలకు శుభవార్త! కొత్త పెన్షన్లకు చంద్రబాబు గ్రీన్ సిగ్నల్!

 

విశాఖలో వైసీపీకి ఊహించని షాక్! ఒకవైపు అరెస్టుల కలకలం... మరోవైపు కీలక నేతలు పార్టీకి గుడ్‌బై!

 

ఉత్తరాంధ్రకు రెడ్ అలర్ట్! రాబోయే మూడు రోజులు ఈ జిల్లాలకు పిడుగులతో కూడిన కుండపోత వర్షం!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #tdpcomments #bigbossarrest #liquorscam #politicalheat #andhrapolitics #breakingnews #tdpleader #somireddy